గోల్డ్ మెడల్స్ అందుకోనున్న అక్క చెల్లెళ్ళు

గోల్డ్ మెడల్స్ అందుకోనున్న అక్క చెల్లెళ్ళు

SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కాదాసు నీరజ, కాదాసు నర్మదాలు నవంబర్ 7న శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనున్నారు. లింగంపేట గ్రామంలోని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన వీరి తల్లిదండ్రులు కష్టపడి కూతుర్లను చదివించారు. గ్రామస్తులు వీరిని అభినందించారు.