డిసెంబర్ 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

డిసెంబర్ 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

TG: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో డిసెంబర్ 20 నుంచి జనవరి 9 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 29న తెప్పోత్సవం, 30న వైకుంఠ ఏకాదశి ఉత్సవం జరగనున్నాయి. అదే రోజున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. భద్రాచలంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రముఖ స్థానం ఉంది.