నడుచుకుంటూ వచ్చిన మనిషిని చంపేశారంటూ ఆందోళన
SRD: నడుచుకుంటూ హాస్పిటల్‌కి వచ్చిన మనిషికి సరైన వైద్యం అందించక చంపేశారంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం SRD రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యానగర్‌కు చెందిన వెంకటేశ్ గౌడ్ మృతి చెందాడని, హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.