పశువులకు గాలికుంటు టీకాల మెగా డ్రైవ్
KNR: శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో పశువులకు సోమవారం భారీ స్థాయిలో గాలికుంటు టీకాల కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ మాధవరావు సారథ్యంలో జరిగిన ఈ డ్రైవ్‌లో మొత్తం 324 పశువులకు వ్యాక్సిన్ వేశారు. పశుపాలకుల వద్దకే వెళ్లి టీకాలు వేయడం ద్వారా పాడి రైతుల సమయాన్ని ఆదా చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.