నాపై చెప్పులతో దాడి చేయబోయారు: లాలూ కుమార్తె
బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ కుమార్తె రోహిణీ తన సోదరుడు తేజస్వీ యాదవ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 'తేజస్వీ, ఆయన సహాయకులే నన్ను కుటుంబం నుంచి బయటకు పంపించారు. కొట్టేందుకు చెప్పులు ఎత్తారు. మురికిదానిని అని తిట్టారు. ఈ మురికి కిడ్నీనే తండ్రికి మార్పిడి చేయించా. దయచేసి అన్నయ్య ఉంటే తండ్రిని కాపాడకండి. పిల్లలను, భర్తను జాగ్రత్తగా చూసుకోండి' అని ట్వీట్ చేశారు.