VIDEO: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదు: మాజీమంత్రి
WNP: మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేసిఆర్ ప్రభుత్వంలో ఏర్పాటైన బస్తీదవఖానాలో వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన కార్మికనగర్‌లోని బస్తిదవఖానను సందర్శించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదని విమర్శించారు.