స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కన్వినర్‌గా నల్లమిల్లి
E.G: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "SIR" ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కోసం రాష్ట్ర కన్వీనర్‌గా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ అధ్యక్షతన ఢిల్లీలోని బీజేపీ నేషనల్ ఆఫీస్‌లో ఈ నెల 7వ తేదీన జరిగే సమావేశానికి హాజరవుతారు.