వైసీపీ సీనియర్ నేతకు మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, 33వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు మంగం పార్వతికి శనివారం రూ. 5,000 ఆర్థిక సాయం అందజేశారు. కాలు నరాల్లో రక్తం గడ్డకట్టడంతో అనారోగ్యంతో ఉన్న ఆమెను పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఈ సాయం అందించామని తెలిపారు.