VIDEO: రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు
RR: శంషాబాద్‌లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారు సిద్ధాంతి సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపి బయటకు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.