గ్రంథాలయ సభ్యులతో మాజీ ఉపరాష్ట్రపతి సమావేశం

NTR: విజయవాడలో బుధవారం రామ్మోహన్ గ్రంథాలయ అభిమానులతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. ఈనెల 12న జరగనున్న గ్రంథాలయ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఊరికో గ్రంథాలయం- ఇంటికో స్వచ్ఛాలయం' నినాదంతో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నారు. పఠనాసక్తి పెంపొందడం సమాజాభివృద్ధికి కీలకం అని వ్యాఖ్యానించారు.