BREAKING: జిల్లాకు రెడ్ అలర్ట్

BREAKING: జిల్లాకు రెడ్ అలర్ట్

SKLM: రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో  పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో జిల్లాలో 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కావున, ప్రజలు అవసరం అయితే తప్ప బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.