సింగూరుపై ప్రభుత్వం ఫోకస్..!
MDK: సింగూరు ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని ఇటీవల నివేదికలు అందిన నేపథ్యంలో క్రమంగా నీటి నిల్వలు తగ్గించి మరమ్మతులను అధికారులు చేపట్టారు. పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేసేందుకు వీలు లేకపోవడంతో జులై నాటికి మరమ్మతులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.