పక్షి సేవే.. పరమాత్మ సేవ
KKD: జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మానవులతో పాటు పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 'సర్వే భవంతు సుఖినః' అనే ఋషుల సంకల్పం కేవలం మనుషులకే కాదు, సమస్త జీవజాతికి వర్తిస్తుంది. ఒక చిన్న పాత్రలో నింపిన జలం, పక్షి దాహాన్ని తీర్చడమే కాదు. మనలోని కరుణను, యజ్ఞభావాన్ని మేల్కొలిపే వైదిక కర్మగా మారుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పక్షుల దాహన్ని తీర్చాలని HITTV ప్రేరేపిస్తోంది.