VIDEO: భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్థానిక మఠం గడ్డ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉదయం పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజ కార్యక్రమం నిర్వహించారు. నగరేశ్వర స్వామి దేవాలయంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు.