చందమూరులో దశాబ్దాల కల సాకారం

చందమూరులో దశాబ్దాల కల సాకారం

ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చందమూరు గ్రామంలో 40 ఏళ్ల నాటి రోడ్డు సమస్యను MLA పరిటాల సునీత పరిష్కరించారు. రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా మట్టి రోడ్ల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి, రవాణా సౌకర్యం మెరుగుపడింది. దీంతో ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.