'నంది కోట్కూరును కర్నూలులో కలపాలి'
NDL: పునర్విభజనపై ప్రభుత్వం తక్షణమే మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని CPI. ML పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నందికోట్కూరు ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి, నంద్యాల జిల్లాలో కలవడం వల్ల రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.