అత్యాధునిక యుద్ధనౌకలకు నిలయం.. విశాఖ నౌకాదళం
VSP: దేశ సముద్ర రక్షణలో విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. 1968లో స్థాపించిన ఈ కమాండ్ బంగాళాఖాతం నుంచి ఇండో-పసిఫిక్ ప్రాంతం వరకు నిరంతరం నిఘా ఉంచుతుంది. భారత నౌకాదళంలోని అతిపెద్ద ప్రధానమైన విభాగం. అత్యాధునిక జలాంతర్గాములు, యుద్ధనౌకలకు ఇది నిలయం. దేశ భద్రతలో విశాఖను అత్యంత కీలకమైన 'స్ట్రాటజిక్ హబ్'గా మార్చడంలో ENC పాత్ర అద్వితీయం.