మేడేను జయప్రదం చేయండి: సుగుణమ్మ

TPT: తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట జరిగే మేడే కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అనుబంధ కార్మిక సంఘాల నేతలు పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి కార్మికులతో కలిసి నివాళులర్పించినట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.