ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు రావాలి: ఎస్పీ కిరణ్ ఖరే

ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు రావాలి: ఎస్పీ కిరణ్ ఖరే

BHPL: పోలీసుల సేవలు పొందేందుకు ప్రజలు నిర్భయంగా పోలీస్టేషన్‌లకు వెళ్లాలని, ఎలాంటి పైరవీలు లేకుండా పౌర సేవలు అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆయన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.