కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా

HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు గురువారం ధర్నా చేపట్టారు. ధర్నాకు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ.. ఎస్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.