VIDEO: రెవెన్యూ సమస్యల మీద అధిక ఫిర్యాదులు
AKP: నర్సీపట్నం RDO కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్లు లోకవరపు రామారావు, వెంకటరమణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, వ్యక్తిగత సమస్యల మీద 16 ఆర్జీలు ప్రజలు అందజేసినట్లు ఆర్డీవో కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.