గుప్త నిధుల కోసం వంద అడుగుల గొయ్యి!
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని సంగం కొండపై గుప్త నిధుల వేట కలకలం రేపింది. ఆగంతకులు కొండపై 100 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. మాంత్రికుడి వేషధారణలో పూజలు చేసి, రాళ్లను తొలిచారు. స్థానికులు చూడటంతో నిందితులు పరారయ్యారు. ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, అటవీశాఖకు సమాచారం అందించారు.