సోలార్ ప్యానళ్లతో అదనపు ఆదాయం

సోలార్ ప్యానళ్లతో అదనపు ఆదాయం

VKB: కొండగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సోలార్ ప్యానళ్లతో రైతులు, గృహ వినియోగదారులకు అదనపు ఆదాయం సమకూరుతుందని ట్రాన్స్ కో సీఎండీ జితేష్ V. పాటిల్ అన్నారు. నిన్న ఆయన పట్టణంలో ఇళ్లపై బిగించిన సోలార్ ప్యానెళ్లను పరిశీలించారు. నియోజకవర్గంలోని 34 గ్రామాల్లో 3వేల ఇళ్లపై ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో CE బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.