వరద ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

వరద ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

MNCL: వరద బాధిత ప్రజలకు సహాయంగా ఉంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. జన్నారం మండలంలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరిగిన బుడగ జంగాల కాలనీ, రోటి గూడ గ్రామాలను ఆదివారం ఆయన సందర్శించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే బాధిత ప్రజలకు, రైతులకు ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.