నా బహిష్కరణపై కోర్టుకు వెళ్తా: మాజీ మంత్రి
అన్నాడీఎంకే పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ తాను కోర్టుకు వెళ్తానని మాజీ మంత్రి సెంగొట్టైయన్ పేర్కొన్నారు. పార్టీలో అర్థ శతాబ్దానికి పైగా పని చేసిన తనకు కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా బహిష్కరించడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. అంతేకాకుండా కన్నీళ్లు ఆగడం లేదని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.