మలేషియా పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి

మలేషియా పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన మలేషియా పర్యటనను రద్దు చేసుకున్నారు. నిన్న ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో, తాజాగా హైదరాబాద్ సహా పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తి విమానాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఉదయం నుంచే ఎయిర్‌పోర్ట్ అథారిటీ, డీజీసీఏ సహా ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.