మంత్రాలయంలో ద్వాదశి వేడుకలు

మంత్రాలయంలో ద్వాదశి వేడుకలు

KRNL: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి వేడుకలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మూల బృందావనానికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించి, పూలు, బంగారు కవచాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం ఊంజల్ మంటపంలో వెండి మృతిక బృందావనాన్ని బంగారు పల్లకీలో ఉంచి పూజలు చేశారు. ప్రాకారం చుట్టూ ఊరేగించారు.