సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

NLG: గట్టుప్పల్ మండలంలోని పగిళ్ల కలమ్మకు రూ.54 వేలు, బండారి రాజుకు రూ.60 వేలు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నామని జగన్నాథం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, వెంకటయ్య, మహమ్మద్ అబ్బాస్, సత్తయ్య, మహమ్మద్ నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.