మద్యం మత్తులో కత్తుల దాడి
GDWL: గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలోని ఒక లాడ్జీలో ముగ్గురు యువకులు అర్థరాత్రి వరకు మద్యం సేవించి, ఆ మత్తులో మాట మాట పెరిగి, ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు యువకులకు గాయాలు కాగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.