శ్రీరామసాగర్ ప్రాజెక్టు అప్‌డేట్

శ్రీరామసాగర్ ప్రాజెక్టు అప్‌డేట్

NZB :మెండోరా మండలం పోచంపాడ్లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం రాత్రి 1,51,806 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1085.60 అడుగుల (61.88 టీఎంసీలు) నీటిమట్టం ఉంది. కాకతీయకు 4,000, అలీసాగరు 180,మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.