పైడిమెట్టలో అధిక వర్షపాతం నమోదు
E.G: జిల్లాలో వరుణుడు దంచికొట్టాడు. ఇవాళ నమోదైన వర్షపాతం వివరాలను APSDMA వెల్లడించింది. తాళ్ళపూడి మండలం పైడిమెట్టలో 44మిమీ అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ద్రోణి ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.