భీమేశ్వర ఆలయాన్ని పర్యటక కేంద్రంగా మార్చుతాం: MLA
KMR: తాడ్వాయిలోని సంతాయిపేట భీమేశ్వరాలయాన్ని పర్యటక కేంద్రంగా మార్చుతామని MLA మదన్ మోహన్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు తీసుకువస్తామని తెలిపారు.