ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
BHNG: మూటకొండూరు మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ కృష్ణ పాల్గొన్నారు.