'డ్రైనేజీ సౌకర్యం కల్పించండి'
ASR: డుంబ్రిగుడ మండలం అరమ గ్రామంలో డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. డ్రైనేజ్ సౌకర్యం లేక మురుగునీరు ఒకే చోట నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.