'యుద్ధ ప్రాతిపదికన ఎంపీ లాడ్స్ పనులు పూర్తికావాలి'
PPM: సీతంపేట మరియు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఎంపీ లాడ్స్ (MPLADS) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ శనివారం నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పనుల పురోగతిపై సమీక్ష జరపారు.