VIDEO: రెండేళ్ల వరకు నీటి కొరత తీరినట్టే
KMR: జిల్లాలో ఈ ఏడాది కురిసిన అసాధారణ వర్షాలకు జల వనరులన్నీ నిండు కుండలా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పంట నష్టం సంభవించినప్పటికీ మొత్తంగా ఈ ఏడాది అన్నదాతకు సాగునీటి సమస్య లేకుండా పోయింది. భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో మరో రెండేళ్ల వరకు నీటి కొరత ఉండదని పలువురు జిల్లా అధికారులు తెలిపారు.