RAIN ALERT: నేడు, రేపు భారీ వర్షాలు

RAIN ALERT: నేడు, రేపు భారీ వర్షాలు

AP: 'దిత్వా' తుఫాన్ ప్రభావంతో ఇవాళ్టి నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీసత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అంచనా వేసింది.