రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
అన్నమయ్య: గాలివీడు మండలం నక్కలవాండ్లపల్లి చెరువు మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పార్సిల్ కొరియర్ బాయ్ ఆసీఫ్ (33) తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఆసీఫ్ ఎడమ కాలు విరిగింది. గ్రామస్తులు వెంటనే స్పందించి అతడిని మొదట రాయచోటికి, ఆపై మెరుగైన వైద్యం కోసం కడప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.