అలంపూర్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా విడుదల

GDWL: స్థానిక ఎన్నికల కోసం అలంపూర్ మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను ఎంపీడీవో పద్మావతి విడుదల చేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను మండల కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. ఈ జాబితాలో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని ఎంపీడీవో గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.