ఎన్నికలతో కొత్త మద్యం షాపులకు జాక్‌పాట్
WGL: జిల్లాలో డిసెంబరు 1 నుంచి తెరుచుకోబోయే కొత్త మద్యం షాపులకు పంచాయతీ ఎన్నికలు బంపర్ ఆఫర్‌గా మారనున్నాయి. తొలి విడత ఎన్నికలకు పది రోజుల ముందే షాపులు ప్రారంభం కావడంతో మద్యం డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మద్యం షాపుల ఓనర్‌లు తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యం కీలక పాత్ర పోషిస్తుండటంతో తొలి నెలలోనే అమ్మకాలు భారీగా ఉంటాయని వారి అంచనా.