రైతుల పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ వినతి

రైతుల పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ వినతి

VKB: ధారూర్ మండలంలో మొక్కజొన్న, జొన్న పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో తక్కువ ధరలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.