VIDEO: ఆలయంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం
MNCL: నెన్నెల మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. ఆదివారం దర్శనానికి వచ్చిన భక్తులు చోరీని గమనించి ఆలయ కమిటీకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.