VIDEO: కుక్కను తప్పించబోయి బోల్తాపడిన ఆటో..

VIDEO: కుక్కను తప్పించబోయి బోల్తాపడిన ఆటో..

HNK: ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన సంఘటన బుధవారం ఐనవోలు మండలం పంతిని గ్రామం శివారు చోటుచేసుకుంది. వర్ధన్నపేట నుంచి వరంగల్‌కు 14మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో పంతిని శివారు బ్రిడ్జి వద్ద బోల్తాపడడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని 108ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.