ఫ్రిడ్జ్ పేలి ముగ్గురికి తీవ్రగాయాలు

ఫ్రిడ్జ్ పేలి ముగ్గురికి తీవ్రగాయాలు

GDWL: ధరూర్ మండల కేంద్రంలో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలి ముగ్గురు తీవ్రగాయలపాలయ్యారు. 108 ప్రోగ్రామ్ మేనేజర్ రవి, రత్నం తెలిపిన వివరాలు.. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణి సుజాత(28), మరో మహిళ అశ్వినితో పాటు ఆమె కొడుకు(11 నెలలు)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.