రాయచోటిలో వర్ష బీభత్సం.. నలుగురు మృతి

రాయచోటిలో వర్ష బీభత్సం.. నలుగురు మృతి

అన్నమయ్య: రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ(27),ఇలియాస్(6)ను కాపాడబోయి మరోవ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటో నుంచి దూకేసిన ఆరవ వాండ్లపల్లికి చెందిన యామిని(8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలికను పోలీసులు గుర్తించి చనిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు.