కొండ్లపూడిలో రూ.45 లక్షలతో రోడ్ల నిర్మాణం: MLA
నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండ్లపూడిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. 45 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి ఇబ్బందులు తొలిగేలా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.