కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLG: నార్కెట్‌పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.