'మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి'
JGL: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం కిష్టంపేటలో రూ.20 లక్షలతో 2, భూపతిపూర్‌లో రూ.20 లక్షలతో 2, వడ్డేలింగాపూర్‌లో రూ.10 లక్షలతో 1, వడ్డెర కాలనీలో రూ.10 లక్షలతో 1, చర్ల కొండాపూర్‌లో రూ. 10 లక్షలతో ఒక మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ భవనాలు దోహదపడతాయని ఆయన తెలిపారు.