ఆదర్శ పాఠశాలకు గ్రంధాలయ పుస్తకాలు వితరణ
CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులు సూరపరాజు సురేష్ ఐదువేల రూపాయలు విలువగల గ్రంధాలయ పుస్తకాలు వితరణగా బుధవారం ఏంఈవో హరిప్రసాద్ వర్మకు అందచేశారు. నీతికథలు, పెద్ద బాలశిక్ష, జాతీయ నాయకుల జీవితచరిత్ర పుస్తకాలు అందజేశారు. దాత సూరపరాజు సురేష్‌ను ఏంఈవో అభినందించారు. HM వెంకమరాజు, ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.