25 లక్షలతో దాసంగాల మండపం ప్రారంభం
GDL: కేటీ దొడ్డి మండలం, పాగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో అలివేలు మంగమ్మ దాసంగాల మండపాన్ని బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన దాత టి. శివకుమార్ ఈ మండపాన్ని రూ. 25 లక్షల విరాళంతో నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విరాళం అందించిన టి. శివకుమార్ చేతుల మీదుగా ఈ మండపాన్ని ప్రారంభించడం జరిగింది.